Thursday 24th April 2025
12:07:03 PM
Home > తాజా > కాంగ్రెస్ నుండి పోటీకి భారీగా అప్లికేషన్లు!

కాంగ్రెస్ నుండి పోటీకి భారీగా అప్లికేషన్లు!

congress party

AP Congress Applications | ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల (YS Sharmila) బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనపడుతుంది. మరోవైపు ఇతర పార్టీలో అవకాశం లేని వారు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు.

ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేందుకు నాయకులు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్ (Manickam Tagore).

175 అసెంబ్లీ స్థానాలకు గాను 813 మంది, 25 పార్లమెంట్ స్థానాలకు 125 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు ఆయన.

అంతేకాకుండా దరఖాస్తు గడువు పొడిగించాలని అభ్యర్థనలు వచ్చినట్లు ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 29 వరకు గడువును పొడిగించినట్లు పేర్కొన్నారు మానిక్కం ఠాగూర్.

You may also like
‘లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు’
‘పిఠాపురంలో దళితులపై గ్రామ బహిష్కరణ’
‘మీ ఆప్యాయతతో నా మనసు ఉప్పొంగింది’
‘జగన్ కు హెలికాప్టర్ ఇవ్వొద్దని కేంద్రమంత్రి ఆఫీస్ నుండి బెదిరింపు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions