Manipur Voilence మణిపూర్ రాష్ట్రంలో ఇద్దరు గిరిజన ( Tribal ) మహిళలను అత్యాచారం చేసి, ఆ మహిళలను నగ్నంగా ఉరేగించిన అమానవీయ ( Inhuman ) ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈ దుశ్చర్యకు పాల్పడిన ప్రధాన నిందితుడి ఇంటికి స్థానికులు నిప్పుపెట్టారు.
గత రెండు నెలలుగా ఈశాన్య మణిపూర్ ( Manipur ) రాష్ట్రం రెండు జాతుల మధ్య ఘర్షణలతో అట్టుదుకుతుంది.
Two Tribal Women Were Paraded Naked| ఘర్షణలు మొదలైన కొద్దిరోజులకే మే 4న మణిపూర్ లోని కంగ్ పోప్కి జిల్లాలో ఇద్దరు గిరిజన మహిళలను మెయితీ తెగకు చెందిన కొంతమంది వ్యక్తులు అత్యాచారం చేసి, నగ్నంగా వారిని ఊరేగించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ( Video ) బుధవారం వైరల్ కాగా దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లుబుకుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేస్ రిజిస్టర్ చేశారు. కిడ్నాప్ ( Kidnap ), గ్యాంగ్ రేప్ ( Gang Rape ), మర్డర్ ( Murder ) కింద కేస్ బుక్ చేశారు.
కేసుకు సంబంధించి ఇప్పటికే నలుగురు నిందితులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
గిరిజన మహిళల అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు అయిన హురైన్ హెరదాస్ సింగ్ (32) ఇంటికి స్థానికులు నిప్పుపెట్టారు.
అత్యాచార ఘటనపై మణిపూర్ సీఎం తీవ్రంగా స్పందించారు. నిందితులకు మరణదండన ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.
కాగా గిరిజన మహిళల అత్యాచార ఘటన పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు ( Demands ) వస్తున్నాయి.
Supreme Court Comments| కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన రీతిలో స్పందించలేదని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అవసరమైతే తామే చర్యలు తీసుకుంటామని కోర్ట్ వ్యాఖ్యానించింది.