Harish Rao Strong Counter to Nara Lokesh | బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు.
గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన లోకేశ్ గోదావరి మిగులు జలాలను మాత్రమే వాడుకుంటామని అంతేకాని కాళేశ్వరంకు చిల్లు పెట్టి నీళ్లు తరలించమని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు స్పందించారు.
ఏపీ మంత్రి లోకేష్ బనకచర్ల కట్టి తీరుతామని అంటుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ఒక్క మాట మాట్లాడటం లేదని మండిపడ్డారు. ఆంధ్ర ప్రభుత్వం బనకచర్ల కడుతాము అంటేనేగా మేము అడ్డు చెప్పేదని రేవంత్ రెడ్డి అన్నారని కానీ లోకేష్ మాత్రం బనకచర్ల కట్టే తీరుతామని చెబుతున్నారని పేర్కొన్నారు.
గురుదక్షణ చెల్లించుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారని అర్థం అవుతుందని విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు లేవని లోకేశ్ ఆరోపణలు చేశారని కానీ ప్రాజెక్టుకు 11 అనుమతులు ఉన్నాయని నొక్కిచెప్పారు. తెలంగాణ హక్కులను, నీటి వాటాలను ఎలా కాపాడుకోవాలో తెలుసు అని, కచ్చితంగా బనకచర్ల ప్రాజెక్టుకు అడ్డుకుంటామని హరీష్ రావు స్పష్టం చేశారు.









