UPI Transactions in 2024 | కొన్నేళ్లుగా మన దేశంలో యూపీఐ (UPI Transactions) లావాదేవీలు గనణీయంగా జరుగుతున్న విషయం తెలిసిందే. నగదు కంటే యూపీఐ ట్సాన్సాక్షన్స్ కే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. పెద్ద పెద్ద షాపింగ్స్ మాల్స్ దగ్గరి నుంచి కూరగాయాల వ్యాపారుల వరకు దాదాపుగా యూపీఐ పేమెంట్సే జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో 2024 జనవరి నుంచి నవంబర్ వరకు జరిగిన యూపీఐ లావాదేవీల వివరాలను కేంద్రం విడుదల చేసింది. ఈ 11 నెలల కాలంలోనే 15,547 కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. ఈ లావాదేవీల విలువ సుమారు రూ. 223 లక్షల కోట్లుగా ఉంటుందని తెలిపింది.
ఇదిలా ఉండగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూపీఐ లైట్ లిమిట్ ను ఒక్కో లావాదేవికి రూ. 500 నుంచి రూ. 1000 వరకు, ఇక యూపీఐ లైట్ వ్యాలెట్ పరిమితిని రూ. 2,000 నుంచి రూ. 5,000 వరకు పెంచుతూ ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.