Google India Tweet On Telugu | ప్రముఖ తెలుగు రచయిత గిడుగు వెంకట రామమూర్తి (Gidugu Venkata Ramamurthy) జయంతి సందర్భంగా ఏటా ఆగస్టు 29వ న తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
ఈ క్రమంలో తెలుగు భాషా ప్రేమికులు, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు గురువారం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.
ఆ లిస్ట్ లో గూగుల్ ఇండియా (Google India) కూడా చేరింది. తెలుగు భాషా దినోత్సవానికి గుర్తుగా ‘మేము తెలుగోళ్ళం ’ అంటూ ఓ ట్వీట్ చేసింది. చిన్నప్పటి రోజులు గుర్తు చేసుకుంటే మాకు మొదట గుర్తొచ్చేది చిట్టి చిలకమ్మ (Chitti Chilakamma) పద్యం అంటూ ఎక్స్ వేదికగా చిట్టి చిలకమ్మ పద్యం వీడియో పోస్ట్ చేసింది.