Globe Trotter now titled as Varanasi | సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి మూవీ టైటిల్, ఒక స్పెషల్ వీడియో రిలీజ్ అయ్యింది. ఈ మేరకు శనివారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈవెంట్ లో మూవీ పేరు ‘వారణాసి’ అని మేకర్స్ ప్రకటించారు.
అలాగే ఒక స్పెషల్ వీడియోను విడుదల చేశారు. నందిపై త్రిశూలం పట్టుకుని మహేష్ బాబు కనిపించిన తీరు అద్భుతం. సదరు స్పెషల్ వీడియో కేవలం గంటల వ్యవధిలోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ ను సొంతం చేసుకుంది. మునుపెన్నడూ కనిపించని విధంగా ఈ సారి మహేష్ పౌరాణిక పాత్రలో కనిపించనున్నారు. రుద్రగా సూపర్ స్టార్ అభిమానుల్ని అలరించేందుకు సిద్ధం అయ్యారు. ఈ మూవీలో మందాకినిగా ప్రియాంక చోప్రా, ‘కుంభ’ గా విలన్ పాత్రలో ప్రిథ్వీరాజ్ సుకుమారన్ నటించారు.
ఇకపోతే ఇది తన డ్రీమ్ ప్రాజెక్టు అని మహేష్ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ సందర్భంగా పేర్కొన్నారు. వారణాసి వంటి ప్రాజెక్టు జీవితంలో ఒకేసారి వచ్చే అవకాశం అన్నారు. ఈ మూవీ విడుదల అయిన తర్వాత యావత్ దేశం గర్వపడుతుందని తెలిపారు. తనను, తన సినిమాల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మహేష్ చేతులెత్తి నమస్కరించారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ పై కేఎల్ నారాయణ, కార్తికేయ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. 2027 సమ్మర్ లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.









