Tuesday 22nd April 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కల్కి సెట్: ఈ అశ్వత్థామ వినాయకుడిని చూశారా!

కల్కి సెట్: ఈ అశ్వత్థామ వినాయకుడిని చూశారా!

kalki ganesh set

Kalki Set Ashwatthama Ganesh | దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. గణనాథుడు వివిధ రూపాల్లో పూజలు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తమిళనాడు (Tamilnadu)లోని కృష్ణగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన గణేశుడు ట్రెండింగ్ లో ఉన్నాడు.

ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన కల్కీ 2898 మూవీ థీమ్ తో సెట్ వేశారు. మూవీలో అశ్వత్థామ గెటప్ లో వినాయకుడిని రూపొందించారు. సినిమాలో కారు బుజ్జితోపాటు కాంప్లెక్స్‌ లోపలికి వెళ్లేలా డిజైన్‌ చేశారు.

కమల్‌ హాసన్‌ పాత్ర యాస్కిన్ బొమ్మ పెట్టారు. లోపల శివలింగంతో పాటు పక్కనే అశ్వత్థామ వినాయకుడిని ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం ఈ కల్కి గణేష్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఈ కల్కి గణేశ్ సెట్ ను సందర్శించి అశ్వత్థామ వినాయకుడిని దర్శించుకుంటున్నారు.

You may also like
south concern on delimitation
త్వరగా పిల్లల్ని కనండి.. సీఎం రిక్వెస్ట్.. అసలు డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళన ఎందుకు?
stalin
త్వరగా పిల్లల్ని కనండి.. కొత్త దంపతులకు సీఎం విజ్ఞప్తి!
Jayam ravi
భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసిన స్టార్ హీరో!
రాజకీయాల్లోకి స్టార్ హీరో.. త్వరలో పాదయాత్ర!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions