Feroze Gandhi’s lost licence reaches grandson Rahul in Raebareli | ఉత్తరప్రదేశ్ రాయబరేలిలో మంగళవారం ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది. దశాబ్దాల క్రితం తన తాతయ్య పోగొట్టుకున్న డ్రైవింగ్ లైసెన్సు లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెంతకు చేరింది. దానిని చూసిన వెంటనే రాహుల్ భావోద్వేగానికి గురయ్యారు. తాజగా రాహుల్ తన పార్లమెంటు స్థానం రాయబరేలిలో పర్యటించారు. ఈ సందర్భంగా రాయబరేలి ప్రీమియర్ లీగ్ కు హాజరయ్యారు. ఇదే సమయంలో వికాస్ సింగ్ అనే ప్రీమియర్ లీగ్ ఆర్గనైసింగ్ కమిటీ మెంబర్ రాహుల్ వద్దకు వచ్చారు. దివంగత ఫిరోజ్ గాంధీకి చెందిన డ్రైవింగ్ లైసెన్సును రాహుల్ కు అందించారు. అది చూసిన రాహుల్ భావోద్వేగానికి గురయ్యారు.
దశాబ్దాల క్రితం ఫిరోజ్ గాంధీ ఈ డ్రైవింగ్ లైసెన్సును రాయబరేలిలో పోగొట్టుకున్నారు. ఆ తర్వాత అది వికాస్ సింగ్ మామకు దొరికింది. దానిని ఆయన జాగ్రత్తగా భద్రపరిచారు. కాగా తాజగా రాహుల్ గాంధీ రాయబరేలికి వస్తున్న విషయం తెలుసుకున్న వికాస్ సింగ్ లైసెన్సును రాహుల్ గాంధీకి అందించాలని భావించారు. ఈ మేరకు మంగళవారం దానిని ఆయనకు అందజేశారు. ఇదిలా ఉండగా దేశ తొలి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 1952లో ఫిరోజ్ గాంధీ రాయబరేలి ఎంపీగా గెలిచారు.









