Donald Trump On Hindus | అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల ( USA President Elections )కు సమయం దగ్గరపడుతుంది. ఈ క్రమంలో ఓటర్లను ఆకర్షించేందుకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ), డొమెక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారీస్ ( Kamala Harris ) తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.
ఇందులో భాగంగా హిందువులను ఉద్దేశించి డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ ( Bangladesh ) లోని హిందువులు, క్రిస్టియన్స్ పై దాడులు జరుగుతున్నాయని, వాల్ల ఇళ్లను దోపిడీ చేస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు. ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు.
కానీ తాను ప్రెసిడెంట్ గా ఉండివుంటే ఇలాంటి ఘటనలు జరిగి ఉండేవి కావని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను జో బైడెన్ ( Joe Biden ), కమలా హ్యారీస్ విస్మరించారని విమర్శించారు. అంతేకాకుండా ఇజ్రాయెల్ ( Israel ), ఉక్రెయిన్ వంటి విషయాల్లో కూడా వారు విఫలమయ్యారని ధ్వజమెత్తారు.
తాను మళ్ళీ ఎన్నికైతే శాంతిని తిరిగి నెలకొల్పనున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా రాడికల్ లెఫ్ట్ యొక్క మత వ్యతిరేక ఏజండా నుండి అమెరికా లోని హిందువులకు రక్షణ కల్పిస్తానని ట్రంప్ తెలిపారు.
హిందువుల స్వేచ్ఛ కోసం, ఇండియా మరియు స్నేహితుడు ప్రధాని మోదీ ( Pm Modi )తో బలమైన స్నేహ సంబంధాలను తిరిగి పునరుద్ధరించనున్నట్లు హాని ఇచ్చారు.
ఈ సందర్భంగా హిందువులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. దీపావళి పండుగ చెడుపై మంచి విజయం సాధించేలా చేస్తుందని తాను బలంగా నమ్ముతున్నట్లు ట్రంప్ వెల్లడించారు.