Deputy Cm Pawan Kalyan News | ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో ఓ మహిళ కూరగాయల షాపును ఏర్పాటు చేసుకుంది.
ప్రజల సమస్యలు వినేందుకు జనసేన పార్టీ జనవాణి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. పలు సందర్భాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ నేరుగా ప్రజల నుండి నేరుగా వినతిపత్రాలు స్వీకరిస్తారు.
ఈ క్రమంలో విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన చికట్ల కరుణ అనే మహిళ తన కష్టాన్ని చెప్పుకునేందుకు మంగళగిరిలోని జనసేన కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న జనవాణికి వచ్చారు. అదే సమయంలో జనవాణిలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
తనకు కుటుంబ పోషణ భారమై ఆర్దికంగా ఇబ్బందులు పడుతున్నట్లు కరుణ తన పరిస్థితిని డిప్యూటీ సీఎంకు వివరించారు. ఆమె కష్టాన్ని అర్ధం చేసుకున్న పవన్ కళ్యాణ్ సొంత నిధులతో ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చారు.
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సహకారంతో విజయవాడ న్యూ రాజరాజేశ్వరీపేటలో రైస్ మరియు కూరగాయలషాపును కరుణ ఏర్పాటు చేశారు. ఈ షాపును ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు ఉదయభాను ప్రారంభించారు.