Deputy Cm Pawan Kalyan Health News | రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. గత నాలుగు రోజులుగా వైద్యం చేయించుకొంటున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.
జ్వరం తీవ్రత తగ్గలేదని దగ్గు ఎక్కువగా ఉండటంతో ఆయన ఇబ్బందిపడుతున్నట్లు పేర్కొంది. వైద్యుల సూచనల మేరకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం మంగళగిరి నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. పవన్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.
ప్రజలకు సేవ చేయడానికి, ప్రస్తుతం ప్రశంసలు అందుకుంటున్న ‘ఓజి’ సినిమా విజయాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి పవన్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.









