Dasanglu Pul | ఇటీవల జరిగిన అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ఘన విజయం సాధించింది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గాను 46 సీట్లలో బీజేపీ జయకేతనం ఎగురవేసింది.
ఈ నేపథ్యంలో పెమా ఖండూ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉండగా రాష్ట్ర చరిత్రలోనే ఓ మహిళ.. మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
మాజీ సీఎం కలిఖో పుల్ (Kalikho Pul) సతీమణి, ఐరన్ లేడీగా పిలుచుకునే దాసంగ్లు పుల్ (Dosanglu Pul) అరుణాచల్ చరిత్రలోనే తొలి మహిళా మంత్రి అయ్యి చరిత్ర సృష్టించారు.
హయూ లియాంగ్ నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా ఆమె ఎన్నికయ్యారు. భర్త మరణాంతరం 2016 నుండి ఈ స్థానం నుండి ఆమె ఎన్నికవుతున్నారు. ఇకపోతే ఆమెకు ఈ శాఖ కేటాయిస్తారో అనేది ఆసక్తిగా మారింది.