Customer Creates Cracked Eggs with AI | ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని శాసించే దిశగా పయనిస్తోంది. ఏఐతో ప్రయోజనాలతోపాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే డీప్ ఫేక్ ఫోటోలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు కొత్త రకం మోసాలు కూడా తెరపైకి వస్తున్నాయి.
తాజాగా ఇన్‌స్టామార్ట్ లో ఓ వినియోగదారుడు ఏఐ సాయంతో ఒక ఫేక్ ఫొటో క్రియేట్ చేసి, కంపెనీ నుంచి పూర్తి రిఫండ్ పొందాడు. ఈ ఘటన ఈ-కామర్స్ కంపెనీల రిఫండ్ వ్యవస్థలలోని లోపాలను ఎత్తి చూపుతోంది. ఓ వ్యక్తి ఇన్‌స్టామార్ట్ లో కోడిగుడ్లు ఆర్డర్ చేశాడు. వాటిలో ఒకటి పగిలి ఉంది.
దీనిపై ఫిర్యాదు చేసే సమయంలో గూగుల్‌కు చెందిన ‘నానో బనానా ప్రో’ అనే ఇమేజింగ్ టూల్‌ను ఉపయోగించి, ఆ ఫొటోలో apply more cracks అని ప్రాంప్ట్ ఇచ్చాడు. దీంతో ఆ ఎగ్ ట్రేలో ఫొటోను 20కి పైగా గుడ్లు పగిలిపోయినట్లుగా మార్చేసింది.
ఈ ఫొటోను చూసిన ఇన్‌స్టామార్ట్ సపోర్ట్ టీమ్ అది నిజమని నమ్మి వెంటనే అతడికి పూర్తి రిఫండ్ చేసింది. ఈ ఘటనను ఎక్స్ లో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇలాంటి మోసాలు కేవలం ఒక శాతం మంది చేసినా, క్విక్-కామర్స్ కంపెనీల వ్యాపారాలు కుప్పకూలిపోతాయని అభిప్రాయపడుతున్నారు.









