IndVsWI Series Team | వచ్చే నెలలో వెస్టిండీస్ జట్టుతో టెస్టు, వన్డే సిరీస్‌లకు (Test and Oneday Series) భారత జట్టును ప్రకటించారు. ఈసారి భారత జట్టులో మూడు కొత్త ముఖాలు చోటు దక్కించుకున్నాయి.
ఐపీఎల్ 2023 (IPL 2023)లో అద్భుత ప్రదర్శన చేసిన రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ముఖేష్ కుమార్‌లకు భారత టెస్టు జట్టులో చోటు దక్కింది.
అదే సమయంలో దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్, అభిమన్యు ఈశ్వరన్ వంటి ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కలేదు.
సెలక్టర్ల ఈ నిర్ణయంపై పలువురు మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ టెస్ట్ సిరీస్ కి ఎంపిక చేసిన టీంను కేవలం ఐపీఎల్ లో వారి ప్రదర్శన బట్టే తీసుకున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.
రంజీ ట్రోఫీ లో ఎంత అద్భుతంగా ఆడిన ఎవరు పట్టించుకోవట్లేదని ట్విట్టర్ వేదికగా పలువురు అభిప్రాయపడ్డారు.
మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా, రంజీ క్రికెటర్ అభినవ్ ముకుంద్ కూడా సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపికచేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇండియన్ క్రికెట్ బోర్డు బీసీసీఐ (BCCI)పై ట్విట్టర్ లో అసహనం వ్యక్తం చేశారు అభినవ్ ముకుంద్ (Abhinav Mukund).
పుతిన్ కు షాక్.. రష్యాలో తిరుగుబాటు.. ఏంటీ వాగ్నర్ గ్రూప్.. ఎవరీ ప్రిగోజిన్..!
(IndVsWI Series Team) సెలక్షన్ కమిటీ ఆటగాళ్లను ఎంపిక చేసే విధానాన్ని ఈ భారత బ్యాట్స్ మెన్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ కంటే ఐపీఎల్ ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నందుకు సెలక్టర్లను తప్పుబట్టాడు.
“ఈ సెలక్షన్ ప్రాసెస్ ను అర్థం చేసుకోలేకపోతున్నాను. వాటిని ట్వీట్‌లో సంగ్రహించడానికి నా బుర్రలో చాలా ఆలోచనలు ఉన్నాయి.
కానీ ఇప్పుడు తన రాష్ట్రం కోసం ఆడటాన్ని గర్వంగా భావించడానికి ఒక ఆటగాడికి ఉన్న ప్రోత్సాహం ఏమిటీ? స్పష్టంగా, ఫ్రాంచైజీ క్రికెట్ ఒక్కటే భారత జట్టులోకి ప్రవేశించడానికి మంచి మార్గం” అని ట్వీట్ చేశాడు అభినవ్.
వెస్టిండీస్ టూర్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను చూసి ముకుంద్ లాగే సునీల్ గవాస్కర్ (sunil gavaskar), ఆకాశ్ చోప్రా (Akash Chopra) వంటి భారత మాజీ క్రికెటర్లు ఆశ్చర్యపోయారు.
ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో “సర్ఫరాజ్ (sarfaraz khan) ఏం చేయాలి? గత మూడేళ్లలో అతని రికార్డును చూస్తే, అతను మిగతా వారి కంటే చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు.
అన్నిచోట్లా పరుగులు చేశాడు. ఇప్పటికీ, అతను ఎంపిక కాకపోతే.. బీసీసీఐ ఏం సందేశం ఇస్తున్నట్లు? అన్ని ప్రశ్నించాడు.