Couple Caught Selling Live S*x Videos For In Hyderabad | హైదరాబాద్ లోని ఓ దంపతులు న్యూడ్ వీడియోల వ్యాపారం మొదలుపెట్టారు. రూ.2000 వేలకు లైవ్ స్ట్రీమింగ్, రూ.500 కు రికార్డు అయిన వీడియోలను విక్రయించే దందాను చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు దంపతులను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ బాగ్ అంబర్పెట్ లో నివాసం ఉండే ఓ క్యాబ్ డ్రైవర్ తన భార్యతో కలిసి శృంగార వీడియోలను ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం ప్రారంభించాడు. అలాగే శృంగార చాటింగ్ చేస్తూ యువకులను ఆకట్టుకునే వారు.
ఈ క్రమంలో డబ్బులు అధికంగా వస్తుండడంతో లైవ్ గా న్యూడ్ వీడియోల కోసం రూ.2000, రికార్డేడ్ వీడియోలను రూ.500కు అమ్మేవారు. ఇందుకోసం లైవ్ లింక్ పరికరాలు, కెమెరాలను కూడా కొనుగోలు చేశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు రంగంలోకి దిగారు.
అంబర్పెట్ లోని టాస్క్ ఫోర్క్ పోలీసులు దంపతుల ఇంట్లో రైడ్స్ నిర్వహించి వారి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.









