Congress MLA Bathula Laxma Reddy in Telangana donates Rs 2 crore for farmer’s | మిర్యాలగూడ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి గొప్ప మనసును చాటుకున్నారు. కుమారుడి వివాహ రిసెప్షన్ ను రద్దు చేసి ఆ డబ్బులను రైతుల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.
ఈ మేరకు బత్తుల లక్ష్మారెడ్డి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రూ.2 కోట్ల చెక్కును సీఎంకు అందజేసి, ఆ డబ్బులను రైతుల కోసం ఖర్చు చేయాలని కోరారు. నియోజకవర్గంలోని లక్ష మంది రైతులకు ఒక్కో యూరియా బస్తా ఉచితంగా ఇవ్వాలని కోరారు.
ఎమ్మెల్యే కుమారుడి సాయి ప్రసన్న వివాహం ఇటీవల జరిగింది. ఈ క్రమంలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయాలని భావించినా, ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని డబ్బులను రైతుల కోసం కేటాయించిట్లు సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేను అభినందించారు.









