CM Revanth Reddy vs KTR | బీఆరెస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ ను, కల్వకుంట్ల కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వనని సవాల్ విసిరారు. అలాగే ఆస్థుల్లో వాటాలు ఇవ్వాల్సి వస్తుందని సొంత బిడ్డను బయటకు పంపారని కవితను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. జల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మా.. పెద్ద నోరేసుకోని అహంకారంతో అరుస్తున్నవా? అంటూ కేటీఆర్ కన్నెర్ర చేశారు. సభ్యత, సంస్కారంలేని నీచమైన వాగుడును చూసి జనం చీదరించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ‘పట్ట పగలు నోట్ల కట్టలతో దొరికిపోయిన ఓటుకు నోటు దొంగవు..అదే నీ స్థాయి. పనికిమాలిన శపథాలు చేయడం..పత్తాలేకుండా పారిపోవడం నీకు వెన్నతో పెట్టిన విద్య. ఆత్మగౌరవం లేని ఢిల్లీ బానిసలం కాదు మేము..రైతన్నల హక్కులకు భంగం కలిగతే భగ్గున మండుతాం. తిట్లు..బూతులతో డైవర్షన్ డ్రామాలు ,తమాషాలు ప్రతీ సారి నడవవ్, జనం అన్నీ గమనిస్తున్నారు…సందర్భం వచ్చినప్పుడు తొక్కి నారతీస్తారు. 2028లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం. మళ్లా వందేండ్ల దాకా పుట్టగతులు లేకుండా పాతిపెట్టడం తథ్యం!’ అని కేటీఆర్ హెచ్చరికలు జారీ చేశారు.









