CM Revanth Reddy Attends Anti-Drugs Day Event in Hyderabad | అంతర్జాతీయ యాంటీ డ్రగ్ డే సందర్భంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ అవగాహన కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ సినీ నటులు రాం చరణ్, విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
అంతేకంటే ముందు మాదక ద్రవ్య రహిత సురక్షితమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
యువతను ఆరోగ్యకరమైన ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించడమే లక్ష్యంగా కలిసి పని చేద్దామని “అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినం” సందర్భంగా ఒక సందేశంలో కోరారు. డ్రగ్ ఫ్రీ తెలంగాణ సంకల్పానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.









