Monday 16th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > హరిహర వీరమల్లు రిలీజ్.. సీఎం చంద్రబాబు స్పెషల్ విషెస్!

హరిహర వీరమల్లు రిలీజ్.. సీఎం చంద్రబాబు స్పెషల్ విషెస్!

chandra babu naidu

Harihara Veeramallu | ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన తాజా చిత్రం హరిహరవీరమల్లు (Harihara Veeramallu). పవన్ నటించిన తొలి పీరియాడికల్ మూవీ కావడంతో అభిమానుల్లో అంచనాలు విపరీతంగా ఉన్నాయి.

పవన్ సరసన నిధి అగర్వాల్ (Nidhi Agarwal) నటించిన ఈ సినిమాకు క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. గురువారం థియేటర్లలో విడుదలైన ఈ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కూడా పవన్ కళ్యాణ్ తోపాటు, హరిహరవీరమల్లు టీం అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు.

‘పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ప్రేక్షకులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న HariHaraVeeraMallu చిత్రం విడుదల సందర్భంగా శుభాకాంక్షలు. మిత్రులు పవన్ కళ్యాణ్ గారు చారిత్రాత్మక కథాంశంతో రూపొందించిన చిత్రంలో తొలిసారి నటించిన ‘హరిహర వీరమల్లు’ సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే సమయాన్ని సర్దుబాటు చేసుకుని నటించిన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని రాసుకొచ్చారు సీఎం చంద్రబాబు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
rajendra prasad
క్షమాపణలు చెప్పండి.. ఇంతటితో ముగించండి!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions