Chiranjeevi birthday wishes to Pawan Kalyan | ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నేపథ్యంలో ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు.
‘చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనాని గా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ!’ అని విషెస్ తెలిపారు.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘నా జీవితానికి మార్గదర్శి, తండ్రి సమానులైన అన్నయ్య, పద్మ విభూషణ్ చిరంజీవి గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు, ప్రేమాభిమానాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు ఎంతో ఆనందం కలిగించాయి. సమాజానికి ఏదైనా చేయాలని, మీరు నేర్పిన సేవా గుణమే ఈరోజు జనసేన పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎల్లప్పుడూ నాతో పాటుగా కోట్లాది మందికి మార్గదర్శకుడిగా నిలవాలని కాంక్షిస్తున్నాను’ అని పవన్ పేర్కొన్నారు.









