- “సేవ్ ఆర్గాన్స్ సేవ్ లైఫ్” క్యాంపెయిన్ పోస్టర్ ఆవిష్కరిచిన చర్లపల్లి కార్పొరేటర్
ప్రపంచవ్యాప్తంగా ఏటా కొన్ని లక్షల మంది ఆంప్యుటేషన్స్ (Amputaions) కి కారణమవుతున్న అనేక రకాల వ్యాధులకు చెక్ పెట్టాలనే లక్ష్యంతో అత్యాధునిక ట్రీట్ మెంట్ (Treatment) అందిస్తోంది హైదరాబాద్ లోని కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ (KBK Hospital)
ఈ ఆసుపత్రిలో మాత్రమే లభించే అత్యున్నత చికిత్స ద్వారా ఎంతో మంది అవయవాలను పరిరక్షించిన కేబీకే హాస్పిటల్ తాజాగా మరో గొప్ప సంకల్పానికి పూనుకుంది.
గ్యాంగ్రీన్ (Gangrene), డయాబెటిస్ ఫుట్ అల్సర్స్ (Foot Ulcers), సెల్యూలైటిస్, అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు తదితర వ్యాధుల నుంచి అవయవాలను కాపాడాలనే సదుద్దేశంతో సేవ్ ఆర్గాన్స్.. సేవ్ లైఫ్ (Save Organs.. Save Life) అనే నినాదంతో జేసీఐ సూపర్ హైదరాబాద్ తో కలిసి గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఈ మేరకు “సేవ్ ఆర్గాన్స్ సేవ్ లైఫ్” క్యాంపెయిన్ కు సంబంధించిన పోస్టర్ ను చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆవిష్కరించారు.
Read Also: BRS హ్యాట్రిక్ విజయానికి సన్నద్ధం కావాలి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డయాబెటిస్ సంబంధింత వ్యాధుల నుంచి అవయవాలు కాపాడాలనే సంకల్పంతో కేబీకే హాస్పిటల్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయం అని కొనియాడారు.
కాళ్లు, చేతులు కొట్టేయాల్సిన స్థాయి వరకు వెళ్లిన బాధితులు కేబీకే హాస్పిటల్ లో చికిత్స చేయించుకోవాలని సూచించారు.
ఆంప్యుటేషన్ లేకుండా ఆయా వ్యాధులను పూర్తిగా నయం చేయడం అభినందనీయం అన్నారు. వీటిపై అవగాహన పెంచేందుకు ఉచిత హెల్త్ క్యాంప్ లు నిర్వహించడం పట్ల ఆసుపత్రి యాజమాన్యాన్ని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో కేబీకే హాస్పిటల్ ప్రతినిధులు దేవులపల్లి శివ కృష్ణ, సత్య సాయి, విశాఖ రాజేందర్ రెడ్డి, సావిరెడ్డి సందీప్ రెడ్డి, చప్పిడి శ్రీకాంత్ రెడ్డి, ముద్దగోని శంకర్, చర్లపల్లి డివిజన్ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.