Wednesday 9th July 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కెనరా బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. జూన్ 1 నుంచి కొత్త నిబంధన!

కెనరా బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. జూన్ 1 నుంచి కొత్త నిబంధన!

canara bank

Canara Bank Good News | భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ కెనరా బ్యాంక్ (Canara Bank) తమ వినియోగదారులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఖాతాదారులు తన సేవింగ్స్ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ పాటించకపోతే విధించే జరిమానాను అధికారికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ కొత్త నిబంధన జూన్ 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ఈ నిర్ణయంతో కెనరా బ్యాంక్‌లో ఎలాంటి పొదుపు ఖాతా కలిగిన వారైనా ఇకపై మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయలేకపోయినా ఎలాంటి జరిమానాలు చెల్లించాల్సిన అవసరం లేదు.

అన్ని కేటగిరీల సేవింగ్స్ ఖాతాలకు ఈ కొత్త రూల్ వర్తిస్తుందని బ్యాంకు స్పష్టం చేసింది. “జూన్ 1 నుంచి, కెనరా బ్యాంక్ కనీస నిల్వ నిర్వహించనందుకు ఎటువంటి పెనాల్టీ విధించదు. ఇది సేవింగ్స్ ఖాతాదారులందరికీ వర్తిస్తుంది” అని బ్యాంక్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో ఒక ప్రకటనలో తెలిపింది.

“ఈ కొత్త విధానంతో, కెనరా బ్యాంక్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారులందరూ ఇప్పుడు అన్ని సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలకు సగటు నెలవారీ బ్యాలెన్స్‌కు సంబంధించిన పెనాల్టీలు లేదా రుసుముల నుంచి విముక్తి పొంది, నిజమైన ‘మినిమమ్ బ్యాలెన్స్‌పై పెనాల్టీ లేని’ సౌకర్యాన్ని ఆస్వాదిస్తారు” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

గతంలో, కెనరా బ్యాంక్ పట్టణ ప్రాంతాల్లోని కస్టమర్లు రూ. 2,000, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ. 1,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 500 మినిమం బ్యాలెన్స్ నిర్వహించాలనే నిబంధన ఉండేది.  

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions