Bus Catches Fire on NH-65 | తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న బస్సు ప్రమాదాలు (Bus Accidents) ప్రజల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే ఏపీలోని కర్నూల్ లో ప్రైవేట్ బస్సు దగ్ధం, తెలంగాణలోని చేవెళ్లలో ఆర్టీస బస్ యాక్సిడెంట్ ఘటనల్లో పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనలను మర్చిపోకముందే తాజాగా తెలంగాణలో మరో బస్సు అగ్ని ఆహుతి అయ్యింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా విహారి ట్రావెల్స్ బస్సులో నల్గొండ జిల్లా చిట్యాల వద్ద నేషనల్ హైవే 65పై మంటల్లో చెలరేగాయి. అయితే డ్రైవర్ అప్రమత్తతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు.
బస్సులో ఉన్న 29 మందికి పెను ప్రమాదం తప్పింది. మంటలు రావడం గమనించి అప్రమత్తమై ప్రయాణికులు కిందకు దూకేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.









