Friday 10th April 2026
12:07:03 PM
Home > తాజా > చేతులెత్తి దండం పెడుతున్నా.. కేసీఆర్ భావోద్వేగం!

చేతులెత్తి దండం పెడుతున్నా.. కేసీఆర్ భావోద్వేగం!

kcr

ఇటీవల గాయమై యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కేసీఆర్ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఓ సందేశం విడుదల చేశారు.

తనను పరామర్శించేందుకు ఆస్పత్రికి రావొద్దంటూ తన అభిమానులు, ప్రజలను కోరారు. తాను త్వరలోనే కోలుకొని వస్తానని, తనను కలిసేందుకు ఆస్పత్రికి ఎవరూ రావొద్దంటూ కేసీఆర్ మంగళవారం ఒక ప్రత్యేక వీడియోలో విజ్ఞప్తి చేశారు.

 ‘రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మందిగా తరలివచ్చిన నా అభిమానులందరికీ నా హృదయపూర్వక వందనాలు.

నాకు అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ వల్ల యశోదా ఆస్పత్రిలో ఉన్నాను. ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని, దానివల్ల సమస్య ఇంకా తీవ్రమవుతుందని, నెలల తరబడి బయటికి పోలేరని వైద్య బృందం హెచ్చరించారు.

మీ అభిమానానికి చేతులెత్తి దండం పెడుతున్నా. మీరందరూ బాధపడకుండా, మీ మీ స్వస్థలాలకు మంచిగా, క్షేమంగా వెనుదిరిగి పోవాలె. కనీసం ఇంకో 10 రోజుల వరకు ఎవ్వరూ కూడా ఆస్పత్రికి తరలిరావొద్దని, అది అందరికీ మంచిది కాదని నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా.

బయట ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఆస్పత్రిలో వందలాది మంది చికిత్స పొందుతున్నారు. వాళ్ల క్షేమం కూడా మనకు ముఖ్యం. అందువల్ల దీన్ని అన్యదా భావించకుండా క్రమశిక్షణతోని అందరూ మీ ఇళ్లకు తిరిగి వెళ్లండి.

నేను మంచిగైన తర్వాత రోజు ప్రజల మధ్య ఉండేవాణ్నే కాబట్టి తప్పకుండా కలుసుకుందాం ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మీరందరూ నా మాట మన్నించి, క్షేమంగా ఇంటికి తరలివెళ్తారని భావిస్తున్నా’ అని కేసీఆర్ అన్నారు.  

You may also like
రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!
kcr revanth
కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్!
kcr revanth
ఇదేక్కడి జాతిపిత లక్షణం.. కేసీఆర్ పై సీఎం రేవంత్ విమర్శలు!
kalvakuntla kavitha
‘నా భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారు’.. సిట్ పిలిస్తే సహకరిస్తా: కవిత

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions