- కూకట్ పల్లి నియోజకవర్గంలో 30 రోజులపాటు ఉచిత ఆరోగ్య శిబిరం
- కేబీకే గ్రూప్ చైర్మన్ తో కలిసి ప్రారంభించిన రాజేశ్వర్ రావు
కొవిడ్ తదనంతర పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు.
ఆయన ఆధ్వర్యంలో కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలో నిర్వహిస్తున్న ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ను కేబీకే గ్రూప్ చైర్మన్ కక్కిరేణి భరత్ కుమార్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాజేశ్వర్ రావు మాట్లాడుతూ వైద్య ఖర్చులు భారమవుతున్న నేపథ్యంలో కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజల కోసం ఈ ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.
నియోజకవర్గ వ్యాప్తంగా బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని సందర్భంగా ఏప్రిల్ 5 నుంచి ప్రారంభమై.. మే 5 వరకు వరుసగా 30 రోజుల పాటు నిరంతరాయంగా ఈ హెల్త్ క్యాంప్ నిర్వహింపజేస్తున్నట్లు వడ్డేపల్లి తెలిపారు.
నియోజకవర్గంలోని పేద ప్రజలంతా ఈ హెల్త్ క్యాంప్ లను సద్వినియోగం చేసుకోని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. క్యాంప్ ప్రారంభించిన వెంటనే స్వయంగా పరీక్షలు చేయించుకున్నారు.

ఉచిత హెల్త్ క్యాప్ లో వైద్య పరీక్షలు చేయించుకుంటున్న వడ్డేపల్లి
ఈ క్యాంప్ ఏర్పాటుకు సహకరించిన కేబీకే హాస్పిటల్ యాజమాన్యం, కేబీకే గ్రూప్ భరత్ కుమార్ కి అభినందనలు తెలియజేశారు.
Read Also: గ్యాంగ్రిన్ పై అవగాహన అవసరం: సేవ్ ఆర్గాన్స్.. పోస్టర్ ఆవిష్కరణలో ఈటల రాజేందర్
గ్యాంగ్రీన్, ఫుట్ అల్సర్స్, సెల్యూలైటిస్, బర్న్స్ లాంటి ఎన్నో సమస్యలకు ఆంప్యుటేషన్ లేకుండా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా చికిత్స అందిస్తుండటం అద్భుతమని కొనియాడారు. ఆయా వ్యాధులతో బాధపడే వారు కేబీకే హాస్పిటల్ ను సంప్రందించవచ్చని సూచించారు.
ఈ సందర్భంగా కేబీకే హాస్పిటల్ వారు అందిస్తున్న ఉచిత హెల్త్ కార్డులను స్థానికులకు పంపిణీ చేశారు. అనంతరం ప్రతి ఒక్కరి అవయవాలు కాపాడాలనే సంకల్పంతో కేబీకే హాస్పిటల్ చేపట్టిన “సేవ్ ఆర్గాన్స్.. సేవ్ లైఫ్స్” క్యాంపెయిన్ పోస్టర్ ను వడ్డేపల్లి రాజేశ్వర్ రావు ఆవిష్కరించారు.

అనంతరం కక్కిరేణి భరత్ కుమార్ మాట్లాడుతూ కూకట్ పల్లి నియోజకవర్గ ప్రజలకోసం 30 రోజుల పాటు ఈ ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం పట్ల వడ్డేపల్లి రాజేశ్వర్ రావు గారికి అభినందించారు.
పేద ప్రజల ఆరోగ్యం పట్ల ఆయన శ్రద్ధ వహించడం ప్రశంసనీయమన్నారు. కేబీకే హాస్పిటల్ ద్వారా కాళ్లు, చేతులు కొట్టేయాల్సిన స్థాయిలో ఉన్న ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గ్యాంగ్రీన్, షుగర్ వ్యాధి పుండ్లు, బోదకాలు పుండ్లు, కాలిన గాయాలకు ఆంప్యుటేషన్ లేకుండా చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
ఈ ఉచిత ఆరోగ్య శిబిరంతో పాటు ఆయా వ్యాధుల బాధితులు ఎవరైనా ఉంటే కేబీకే హాస్పిటల్ సేవలు వినియోగించుకోవచ్చని సూచించారు.
ఈ కార్యక్రమంలో కేబీకే హాస్పిటల్ డైరెక్టర్ దేవులపల్లి శివకృష్ణ, సత్యసాయి, కేబీకే గ్రూప్ ప్రతినిధులు విశాఖ రాజేందర్ రెడ్డి, సావిరెడ్డి సందీప్ రెడ్డి, జక్కి అరుణ్ కుమార్, వైద్య సిబ్బంది, స్థానిక బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.