Biryani Orders in Swiggy | నూతన సంవత్సర వేడుకల్లో ఈ ఏడాది కొత్త కొత్త రికార్డులు నమోదయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఆన్ లైన్ వేదికగా బిర్యానీ ఆర్డర్లు రికార్డు స్థాయిలో పెరిగాయి.
డిసెంబర్ 31 ఒక్కరోజే నిమిషానికి 1,244 బిర్యానీల ఆర్డర్ వచ్చినట్టు ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ వెల్లడించింది.
ఆ రోజు హైదరాబాదీ భోజన ప్రియులు ఏకంగా 4.8 లక్షల బిర్యానీలు ఆర్డర్ చేసి పాత రికార్డులను తిరగరాశారు. గతంలో ఐసీసీ వరల్డ్ కప్- 2023 ఫైనల్ సందర్భంగా కూడా ఈ స్థాయిలో ఆర్డర్లు వచ్చాయి.
తాజాగా ఆ సమయంలో వచ్చిన దాని కంటే 1.3 లక్షల ఆర్డర్లు ఎక్కువగా వచ్చాయని స్విగ్గీ పేర్కొంది. గతంలో కంటే 1.6 రేట్లు అధికంగా బిర్యానీ ఆర్డర్లను ఆందుకున్నట్టు స్విగ్లీ తెలిపింది.
అయితే దేశవ్యాప్తంగా నాలుగు బిర్యానీలు ఆర్డర్ పెడితే అందులో ఒకటి పక్కగా హైదరాబాద్ నుంచే కావటం గమనార్హం.
2024 న్యూఇయర్ వేడుకల సందర్భంగా.. స్విగ్గీ ఫుడ్ డెలివరీ, ఇన్‌స్టామార్ట్ లో గత రికార్డులన్ని బ్రేక్ అయినట్టు వెల్లడించింది. డిసెంబర్ 31న రాత్రి సమయంలో 9 నుంచి 10 మధ్యలో ఒక గంటలోనే దాదాపు మిలియన్ మంది వినియోగదారులు స్విగ్గీ యాప్‌లో యాక్టివ్‌గా ఉన్నట్టు స్విగ్గీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
“గత గంటలో దాదాపు మిలియన్ మంది వినియోగదారులు Swiggy యాప్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. రేపటి నుంచి జిమ్‌లో చేరే వారి సంఖ్య కంటే ఇది ఎక్కువ’’ అని యాప్ ఆదివారం ఎక్స్ లో పోస్ట్ లో పేర్కొంది. కాగా, ఈ సంవత్సరం ఒక మిలియన్ మందికి పైగా ఇతరులకు ఆహారాన్ని ఆర్డర్ చేశారు.
బిర్యానీల విషయం ఇలా ఉంటే.. న్యూఇయర్ సందర్భంగా గంటకు 1722 యూనిట్ల కండోమ్‌ల ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ తెలిపింది. అది కూడా తెల్లవారుజామున ఎక్కువగా ఆర్దర్ చేసినట్లు పేర్కొంది. ఇక డిసెంబర్ 30, 31న ఏకంగా 2.3 లక్షల ఓయో రూం బుకింగ్స్ అయ్యాయట!!!