BCCI Prize Money For Team India | భారత పురుషుల క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 (T20 World Cup)ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఈ జట్టుకు మంగళవారం భారీ నజరానా ప్రకటించింది.
టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు రూ.131 కోట్లు ఇవ్వనున్నట్లు బీసీసీఐ సెక్రటరీ దేవిత్ సైకియా ధ్రువీకరించారు ‘అద్భుత ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన టీమ్ండియాకు బీసీసీఐ రూ.131 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది’ అని సైకియా తెలిపారు.
కాగా, టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన తర్వాత టీమ్ ఇండియాకు ఐసీసీ రూ.21.5 కోట్లను బహుమతిగా ప్రకటించింది. రన్నరప్ గా నిలిచిన న్యూజిలాండ్ రూ.10.75 కోట్లు పొందనుంది. సెమీస్ కు చేరుకున్న సౌత్ ఆఫ్రికా, ఇంగ్లండ్ జట్లకు రూ. 7.24 కోట్ల చొప్పున అందజేయనుంది.
సూపర్ 8 లో ఆడిన ఒక్కో జట్టుకు 3. 48 కోట్ల రూపాయలు ప్రకటించింది. ఇక గ్రూప్ దశ నుంచే వెనుదిరిగిన ఒక్కో టీం కు 2.29 కోట్ల చొప్పున పంపిణీ చేయనుంది.










