Baramulla encounter | బారాముల్ల ( Baramulla ) లోని ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదిని భారత సైన్యం ( Indian Army )మట్టుబెట్టింది. ఉగ్రవాది దాక్కున్న ఇంటిని బుల్లెట్లతో జల్లెడ చేసిన ఆర్మి, అనంతరం అతడిని మట్టుపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
జమ్మూకశ్మీర్ ( Jammu Kashmir ) అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పొరుగు పాకిస్తాన్ ( Pakistan ) నుండి ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత వారం రోజుల్లో మూడు సార్లు ఉగ్రమూకలు మనదేశంలోకి చొరబాటు యత్నం చేశారు.
వీరికి పాకిస్తాన్ సైన్యం సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా జమ్మూ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ( Pm Modi ) పర్యటన ముందు బారాముల్ల లో ఉగ్రవాదిని భారత సేన అంతం చేసింది.
మొదట అతడు దాక్కున్న ఇంటిపై సైన్యం బుల్లెట్ల వర్షం కురిపించింది. దింతో ఉగ్రవాది బయటకు పరుగులు తీస్తూ ఎదురు కాల్పులు జరిపారు.
వెంటనే పక్కనే ఉన్న పొదల్లో నక్కాడు. ఇది గమనించిన సైన్యం పొదలపై భీకర కాల్పులు జరపగా ఉగ్రవాది చనిపోయాడు. బారాముల్ల చాక్ తాప్పర్ క్రేరీలో శనివారం జరిగిన ఎన్కౌంటర్ లో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులు అంతమయ్యారు.









