Saturday 21st March 2026
12:07:03 PM
Home > తాజా > రేవ్ పార్టీ కేసు: పోలీసుల ఛార్జ్ షీట్ లో నటి హేమ!

రేవ్ పార్టీ కేసు: పోలీసుల ఛార్జ్ షీట్ లో నటి హేమ!

Hema

Actress Hema in Rave Party Charge sheet | బెంగుళూరు నగర శివారులో మే 15న ఓ ఫార్మ్ హౌస్ లో జరుగుతున్న రేవ్ పార్టీ(Rave Party) ని పోలీసులు భగ్నం చేసిన విషయము తెల్సిందే.

ఈ పార్టీలో టాలీవుడ్ ప్రముఖ నటి హేమ కూడా ఉన్నారని పోలీసులు నిర్దారించారు. తాజాగా దీనికి సంబంధించిన ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు. ఇందులో నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఎండీఎంఏ డ్రగ్ ను హేమా సేవించినట్లు పోలీసులు ఛార్జ్ షీట్ లో చెప్పారు. అలాగే ఈ కేసులో 88 మందిని నిందితులుగా పోలీసులు పేర్కొన్నారు. మొత్తంగా 1086 పేజీలతో పోలీసులు ఛార్జ్ షీట్ ను పొందుపరిచారు.

ఇదిలా ఉండగా రేవ్ పార్టీని పొలిసులు భగ్నం చేసిన రోజు తాను ఆ పార్టీలో లెనట్లు హేమా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తాను ఎటువంటి డ్రగ్స్ ను సేవించలేదని రిపోర్టులు చూపించారు.

You may also like
Hema
బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. నటి హేమకు బెయిల్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions