Avalanche In Kashmir | జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir)లోని భారీ హిమపాతం (Avalanche) కురిసింది. సముద్రపు అలల్లాగా మంచు ఉవ్వెత్తిన ఎగసిపడుతూ ఓ రిసార్ట్ ను ముచ్చెత్తింది. మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఈ ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. జమ్మూ కశ్మీర్ లో దాదాపు అన్నిచోట్లా అత్యంత కఠిన వాతావరణం నెలకొంది. ఓవైపు మంచు విపరీతంగా కురుస్తుండడంతో పాటు.. మరోవైపు చలిగాలులు స్థానికులను వణికిస్తున్నాయి.
శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్, అనంతనాగ్, కార్గిల్, సోన్‌మార్గ్, కుప్వారా, పుల్వామా, బేతాబ్ వ్యాలీ, పట్నిటాప్, పూంఛ్, కిష్టవార్ దాదాపు గా అన్నిచోట్లా హిమపాతం కురుస్తోంది.
రహదారుల వెంట అడుగులకొద్దీ మంచు పేరుకుపోయింది. మరోవైపు ఉత్తరాఖండ్ లోని పలు ఎత్తైన ప్రాంతాలకు కూడా వాతావారణ శాఖ అధికారులు హిమపాతం కురవొచ్చని హెచ్చరికలు జారీ చేసింది.









