YS Jagan Satires On CM Chandra babu | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) త్వరలోనే ఉప ప్రధాని అవుతారని వస్తున్న ఊహాగానాలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (YS Jagan) సెటైర్లు వేశారు.
చంద్రబాబును ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం, ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు? అంటూ సెటైర్లు వేశారు. ఈ మేరకు బుధవారం తాడేపల్లిలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
అలాగే ‘వైసీపీ ఎమ్మెల్యేలు 11 మందే ఉన్నా 1100 మంది ఉన్నట్లు ప్రవర్తిస్తున్నారు’ అని వ్యాఖ్యానించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కామెంట్స్ పై స్పందిస్తూ అది మంచి విషయమే గా అని జగన్ బదులిచ్చారు.
అలాగే 16 రోజుల పాటు జరిపిన శాసనసభ సమావేశాల్లో ప్రజలకు ఒరిగింది సున్నా అని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుమారుడు నారా లోకేశ్(Nara Lokesh)ను పొగడడం, లోకేశ్ చంద్రబాబును పొగడడం, వీరిద్దరిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొగడడమే సరిపోయిందని ఎద్దేవా చేశారు.










