Tuesday 17th March 2026
12:07:03 PM
Home > తాజా > హైడ్రా నోటీసులపై స్పందించిన సీఎం సోదరుడు.. ఏమన్నారంటే!

హైడ్రా నోటీసులపై స్పందించిన సీఎం సోదరుడు.. ఏమన్నారంటే!

Anumula Tirupati Reddy | హైదరాబాద్ లో చెరువుల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూలగొడుతున్న హైడ్రా (Hydra) సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సోదరుడికి కూడా నోటీసులు ఇచ్చింది. అమర్ కో ఆపరేటివ్ సొసైటీ (Amar Co-Operative Society) లో ఉంటున్న తిరుపతిరెడ్డి (Anumula Tirupati Reddy) ఇంటితోపాటు ఆఫీస్ కూడా FTL జోన్‌లోనే ఉందని నోటీసుల్లో పేర్కొన్నారు. 30 రోజుల్లోగా ఆ అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో హైడ్రా నోటీసులపై స్పందించారు తిరుపతి రెడ్డి. 2015లో అమర్‌సొసైటీలో తన నివాసాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. కొనుగోలు సమయంలో ఆ ఇల్లు ఎఫ్‌టీఎల్‌లో ఉందనే విషయం తనకు తెలియదన్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని తిరుపతి రెడ్డి స్పష్టం చేశారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions