Ambati Rambabu Sends Best Wishes to Pawan Kalyan’s Hari Hara Veera Mallu | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ‘హరిహర వీరమల్లు’.
ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి, జ్యోతిక్రిష్ణ దర్శకత్వం వహించారు. జులై 24న ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.
హరిహర వీరమల్లు సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. పవన్ కళ్యాణ్ “హరిహర వీర మల్లు” సూపర్ డూపర్ హిట్టై కనక వర్షం కురవాలని కోరుకుంటున్నట్లు అంబటి రాంబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.









