Allu Arjun In Unstoppable Show | తాజగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Icon Star Allu Arjun ) తన వ్యక్తిగత విషయాలు గురించి మాట్లాడారు. నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ అన్ స్టాపబుల్ ‘ టాక్ షోకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు.
దీనికి సంబంధించిన ప్రోమో ( Promo )ను ఆహా విడుదల చేసింది. ఇందులో తెలుగు సినీ ఇండస్ట్రీ నుండి ఒక్కరికీ నేషనల్ అవార్డు రాకపోవడం తనను తీవ్రంగా బాధించినట్లు ఆయన చెప్పారు. అలాగే అమ్మాయిలకు ఏదైనా అన్యాయం జరిగితే తనకు కోపం వస్తుందన్నారు.
ఈ సందర్భంగా చిన్నప్పుడు అమ్మ చేతిలో చాలా సార్లు దెబ్బలు తిన్నట్లు తీపి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఇంట్లో ఉండే ప్రతీ వెపన్ ( Weapon ) తో అమ్మ తనను బాదేదన్నారు. ఈ సమయంలో ఏ వెపన్ మూలంగా అల్లు అర్జున్ మారిపోయాడు అని బాలకృష్ణ ప్రశ్నించగా, స్నేహా రెడ్డి ( Sneha Reddy ) అనే వెపన్ మూలంగా తాను మారినట్లు ఐకాన్ స్టార్ తన సతీమణి గురించి ప్రస్తావించారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉన్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. దీనికి సంబంధించిన తొలి ఎపిసోడ్ నవంబర్ 15న ప్రసారం కానుంది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక సినిమా పుష్ప 2 డిసెంబర్ 5న విడుదల అవనున్న విషయం తెల్సిందే.