Allu Arjun Files Petition In Telangana High Court | నటుడు అల్లు అర్జున్ హై కోర్టు ( High Court )ను ఆశ్రయించారు. డిసెంబర్ 5న అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కిన పుష్ప-2 ది రూల్ ( Pushpa-2 The Rule ) విడుదలైన విషయం తెల్సిందే.
అయితే డిసెంబర్ 4నే పలు థియేటర్లలో బెనిఫిట్ షోలను ప్రదర్శించారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న సంధ్య థియేటర్ ( Sandhya Theatre ) ను సందర్శించారు.
ఈ సందర్భంగా ప్రేక్షకుల మధ్య తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.
దింతో అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీసు స్టేషన్ లో బిఎన్ఎస్ ( BNS ) 105, 118 సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. కాగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చిన సమయంలో యాజమాన్యం భద్రతపరమైన జాగ్రత్తలు తీసుకోలేదని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో థియేటర్ యజమాని, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.