Vijay Deverakonda Kingdom | టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్డమ్’ (Kingdom). గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri) డైరక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
ఈ సినిమా విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. ఈ సినిమా గురువారం థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల వరుస ఫ్లాప్ లు ఎదుర్కొన్న విజయ్ కింగ్ డమ్ పై చాలా ఆశలు పెట్టుకున్నారు.
ఈ నేపథ్యం లో తాజాగా విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. “సూరి(కింగ్డమ్ లో విజయ్ పాత్ర పేరు) చాలా కోపంతో రగిలిపోతున్నాడు. కానీ, అభిమానుల ప్రేమ వల్ల నేను మాత్రం ఈరోజు ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నాను. మీ అందరికీ నా లవ్ అండ్ హగ్స్. రేపు థియేటర్లలో కలుద్దాం” అని విజయ్ దేవరకొండ రాసుకొచ్చాడు. ప్రస్తుతంఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.










