Actor Shivaji News | నటుడు శివాజీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా అనుకున్న వాళ్లే తనపై కుట్ర చేశారన్నారు. ‘దండోరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మహిళల వస్త్రాధరణపై శివాజీ చేసిన కామెంట్స్ కొన్నిరోజులుగా చర్చలో ఉన్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారడంతో ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మహిళా కమిషన్ శివాజీకి నోటీసులు జారీ చేసింది. తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో శనివారం కమిషన్ ఎదుట హాజరై ఛైర్ పర్సన్ నేరెళ్ల శారదకు వివరణ ఇచ్చారు శివాజీ.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ..ఇంతటితో ఈ అంశానికి ముగింపు పలుకుదామని మీడియాకు విజ్ఞప్తి చేశారు. సలహాలు, మంచి మాటలు చెప్పడం మానుకోవాలని హితవుపలికారు. ఎవరి అభిప్రాయాలు వాళ్లకు తెలుసన్నారు. తనతో కెరీర్ మొదలు పెట్టినవారే తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తన ముప్పై ఏళ్ల సినీ కెరీర్ లో ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని కానీ ఎందుకో తనపై కొందరికి వ్యతిరేకత ఉందన్నారు. తనతో మంచిగా మాట్లాడుతూ, తన నటనను పొగుడుతున్న వారే తనపై కుట్ర చేశారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇంత కుట్ర చేయాలా అని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై కుట్ర పన్నుతూ ఎవరెవరు జూమ్ మీటింగులు పెట్టారో తెలుసని శివాజీ కీలక వ్యాఖ్యలు చేశారు.









