Deputy Cm Pawan Kalyan News | రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనలో భాగంగా గురువారం ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను పరిశీలించారు. ఈ క్రమంలో తల్లి అంజనా దేవి జన్మదినోత్సవం సందర్భంగా జూపార్క్ లోని రెండు జిరాఫీలను ఏడాదిపాటు దత్తత తీసుకుంటున్నట్లు పవన్ ప్రకటించారు. రెండు జిరాఫీలకు ఏడాదిపాటు అయ్యే ఖర్చు మొత్తం భరించనున్నట్టు వెల్లడించారు. జంతు సంరక్షణకు కార్పోరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అనంతరం జూ పార్క్ లో నూతనంగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్ క్లోజర్ ను ప్రారంభించారు. జూపార్క్ లోని నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాల ఎంక్లోజర్ల వద్దకు వెళ్లి వాటికి అందించే ఆహారం, వాటి పేర్లు తదితర వివరాలు జూ క్యూరేటర్ ని అడిగి తెలుసుకున్నారు. ఏనుగులు, జిరాఫీల శాలలను పరిశీలించి వాటికి ఆహారం అందించారు.









