Thursday 29th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఖాకీ దుస్తుల కాఠిన్యం వెనక కరిగిన అమ్మ మనసు.. వీడియో వైరల్!

ఖాకీ దుస్తుల కాఠిన్యం వెనక కరిగిన అమ్మ మనసు.. వీడియో వైరల్!

police as mother

Police Raid In Datia | ఖాకీ దుస్తులు అంటే కాఠిన్యానికి నిదర్శనంగా ముద్రపడిపోయింది కానీ.. ఆ  యూనిఫాం వెనక మంచి మనసు ఉంటుందని మరోసారి నిరూపితమైంది. విధుల నిర్వహణంలో ఒ మహిళా పోలీస్ ఎంత కఠినంగా వ్యవహరించినా.. ఆమెలో ఉన్న అమ్మతనం మాత్రం దాచుకోలేకపోయింది.

విధుల్లో భాగంగా రైడ్ కి వెళ్లిన ఓ పోలీస్ బృందంలోని మహిళా అధికారి అక్కడే గుక్కపట్టి ఏడుస్తున్న తల్లికి కాసేపు తల్లయింది. లాలించి, తినిపించి, జోకొట్టి నిద్రపుచ్చింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

దటియా జిల్లాలోని ఓ గ్రామంలో కొంతమంది అక్రమంగా మద్యం తయారు చేస్తున్నారనే సమాచారంతో ఓ పోలీస్ బృందం దాడి చేసింది. దీంతో ఒక కుంటుంబం తమ పిల్లలను అక్కడే వదిలేసి పారిపోయారు. అందులో మూడు నెలల పసికందు ఆకలితో, చలితో వణుకుతూ ఇంటి పైకప్పుపై ఒంటరిగా ఉండిపోయింది.

తన పదేళ్ల అక్క ఆ బిడ్డను చూసుకుంటోంది. ఈ దృశ్యాన్ని గమనించిన సబ్‌డివిజనల్ ఆఫీసర్ ఆకాంక్ష జైన్ కు వెంటనే మనసు కరిగిపోయింది. కాసేపు పోలీసుననే విషయం పక్కనపెట్టి అమ్మలా మారిపోయింది. పసికందును తన ఒడిలోకి తీసుకుని పాలు తాగించి, వెచ్చని దుస్తులు కప్పి, నిద్రపోయే వరకు లాలించింది.

ఆ తరువాత ఆ చిన్నారిని భద్రంగా ఆ బాలికకు అప్పగించించింది. ఏదైనా అత్యవసరమైతే వెంటనే పోలీసులకు ఫోన్ చేయమని చెప్పింది. ఆకాంక్ష జైన్ ఆ చిన్నారిని నిద్రపుచ్చుత్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

You may also like
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క
పోలీసులకు గుడ్ న్యూస్..బర్త్ డే, పెళ్లి రోజున సెలవులు
కేసీఆర్ కు నోటీసులు..’సూర్యుడిపై ఉమ్మివేయడమే’
తల్లి పుట్టినరోజు..జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions