Thursday 29th January 2026
12:07:03 PM
Home > తాజా > ‘జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు: సమంత!

‘జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు: సమంత!

samantha at At Home

Samantha Emotional Post | సినీ నటి సమంత (Samantha)కు అరుదైన అవకాశం దక్కింది. భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ (At Home) విందుకు ఆమెకు ఆహ్వానం లభించింది.

ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి హాజరైన అనంతరం సమంత సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. తన జీవితంలోలో ఇలాంటి ఒక రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదని పేర్కొన్నారు.

తన అదృష్టం, మాతృభూమి వల్లే ఇది సాధ్యమైందని సమంత ఆనందం వ్యక్తం చేశారు. “నా కెరీర్ లో నన్ను ప్రోత్సహించేవారు లేరు. ఎప్పటికైనా ఇలాంటి వేదికపై నిలుచుంటానని నా అంతరాత్మ కూడా చెప్పలేదు. ఎలాంటి మార్గం కనిపించలేదు.

ఇలాంటి కలలు కనడానికి కూడా అప్పట్లో సాహసించలేదు. కానీ నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళ్లాను. ఈ దేశం నా కృషికి తగిన గుర్తింపు ఇచ్చింది. దీనికి ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని రాసుకొచ్చారు.

రాష్ట్రపతి భవన్‌లో దిగిన పలు ఫొటోలను, విందుకు సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని కూడా ఆమె షేర్ చేశారు.  

You may also like
samantha wedding
కొత్త కోడలికి ఆత్మీయ స్వాగతం.. సమంత ఫ్యామిలీ ఫొటో వైరల్!
samantha wedding
వివాహ బంధంలోకి సమంత.. సోషల్ మీడియాలో వైరల్!
samantha
ఒంటరితనం భయంకరమైంది.. సమంత పోస్ట్ వైరల్!
samantha
‘లివ్ అండ్ లెట్ లివ్.. ఫ్యాన్ కామెంట్ కి సమంత ఘాటు రిప్లై!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions