JD(U) MLA Anant Singh Caught Smoking In Hospital | బీహార్ రాష్ట్రంలోని అధికార జేడీయూ ఎమ్మెల్యే అనంత్ సింగ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. సాధారణ మెడికల్ చెకప్ కోసం జైలు నుంచి హాస్పిటల్ కు వచ్చిన ఈ ఎమ్మెల్యే పోలీసులు, మద్దతుదారుల మధ్యలో నిల్చుని హాస్పిటల్ లో నడుస్తూ సిగరెట్ తాగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. దింతో అధికార పార్టీపై ప్రతిపక్షాలు భగ్గుమంతున్నాయి. నితీష్ కుమార్ సుపరిపాలనకు ధూమపానంతో మద్దతు తెలుపుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యే అంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. గతేడాది బీహార్ లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. మోఖామ అసెంబ్లీ స్థానం నుండి బాహుబలి గా పొరొందిన, చోటా సర్కార్ గా పిలవబడే అనంత్ సింగ్ ఐదవ సారి అధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు.
జైలులో ఉండే ఆయన ఎమ్మెల్యేగా గెలవడం గమనార్హం. ఎన్నికల కంటే ముందు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు చెందిన జన సురాజ్ పార్టీ నేత దులార్ చంద్ యాదవ్ హత్య కేసులో అనంత్ సింగ్ అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన బేఉర్ జైలులో ఉన్నారు. తాజగా అనంత్ సింగ్ ను జైలు అధికారులు మెడికల్ చెకప్ కోసం పట్నాలోని ఇందిరాగాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తీసుకువచ్చారు. ఈ సమయంలో హాస్పిటల్ లో సిగరెట్ తాగుతూ అనంత్ సింగ్ వెళ్తున్న దృశ్యాలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో అధికార జేడీయూ పై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా హత్య, అక్రమ ఆయుధాల, భూ ఆక్రమణలు ఇలా అనేక రకాలైన కేసుల్లో అనంత్ సింగ్ గతంలో పలు సందర్భాల్లో అరెస్టయ్యారు.









