Friday 30th January 2026
12:07:03 PM
Home > తాజా > ‘మీరు లేనిదే నేను లేను’..చిరు ఎమోషనల్

‘మీరు లేనిదే నేను లేను’..చిరు ఎమోషనల్

Megastar Chiranjeevi Emotional Words | మెగాస్టార్ చిరంజీవి-దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ బ్లాక్ బస్టర్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని ఘన విజయం చేసినందుకు అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు చిరు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. “మన శంకరవరప్రసాద్ గారు” చిత్రంకి ప్రేక్షక దేవుళ్లు చూపిస్తున్న ఆదరణ మరియు అపూర్వమైన విజయాన్ని చూస్తుంటే తన మనసు కృతజ్ఞత భావనతో నిండిపోతోందని చిరు పేర్కొన్నారు.

‘నేను ఎప్పుడూ చెప్పేది నమ్మేది ఒక్కటే నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడింది. మీరు లేనిదే నేను లేను. ఈ రోజు మళ్లీ అదే నిజమని మీరు నిరూపించారు. ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులది, నా ప్రాణసమానమైన అభిమానులది, నా డిస్ట్రిబ్యూటర్లది, సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతీ ఒక్కరిది మరియు ముఖ్యంగా దశాబ్దాలుగా నా వెంట నిలబడి ఉన్నవారందరిది. వెండితెర మీద నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే నా శక్తి. రికార్డులు వస్తుంటాయి – పోతుంటాయి, కానీ మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం. ఈ బ్లాక్బస్టర్ విజయం వెనుక ఎంతో కృషి చేసిన మా దర్శకుడు HIT MACHINE అనిల్ రావిపూడికి, నిర్మాతలు సాహు & సుస్మితలకు, అలాగే మొత్తం టీమ్ అందరికీ, నాపై మీరందరూ చూపిన అచంచలమైన నమ్మకానికి ధన్యవాదాలు’ అని మెగాస్టార్ సంతోషం వ్యక్తం చేశారు.

You may also like
మేడారంలో అద్భుత దృశ్యం..జనంలోకి సమ్మక్క
పోలీసులకు గుడ్ న్యూస్..బర్త్ డే, పెళ్లి రోజున సెలవులు
కేసీఆర్ కు నోటీసులు..’సూర్యుడిపై ఉమ్మివేయడమే’
తల్లి పుట్టినరోజు..జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions