Mappls App | ప్రస్తుతం టెక్నాలజీ యుగంలో గూగుల్ మ్యాప్స్ (Google Maps) గురించి తెలియని వాళ్లు ఉండకపోవచ్చు. ఏ కొత్త ప్రాంతానికి వెళ్లి సులభంగా అడ్రస్ పట్టుకోవాలంటే గూగుల్ నావిగేషన్ మ్యాప్ పైనే ఆధారపడటం సర్వసాధారణం అయింది.
ప్రతి స్మార్ట్ ఫోన్లలో ఈ యాప్ ఇన్ బిల్ట్ గా వస్తుంది. ఈ నేపథ్యంలో గూగుల్ కు పోటీగా ఓ మేడిన్ ఇండియా యాప్ ను పరిచయం చేశారు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్. గూగుల్ మ్యాప్స్ కి ప్రత్యామ్నాయమైన మాపుల్స్ చాలా బాగా పని చేస్తుందని ఆయన సోషల్ మీడియా వేదికగా వేదికగా పోస్ట్ చేశారు.
ఇందులో 13 మంచి ఫీచర్లు ఉన్నాయని, తప్పకుండా వాడాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ యాప్ ద్వారా రోడ్లపై ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లను ఈజీగా గుర్తించవచ్చని, అపార్ట్ మెంట్లలో ఉండే షాప్లను కూడా చూపిస్తుందని తన కారులో ‘మ్యాపుల్స్’ నావిగేషన్ యాప్ వాడుతున్న వీడియో పోస్ట్ చేసి వివరించారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.






