Saturday 31st January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మోదీ బర్త్ డే..మూడు నెలల తర్వాత ట్రంప్ తో మాట

మోదీ బర్త్ డే..మూడు నెలల తర్వాత ట్రంప్ తో మాట

U.S. President Trump Dials PM Modi on His 75th Birthday | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు.

మోదీకి ఫోన్ చేసిన ట్రంప్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. జూన్ 17 తర్వాత ఈ ఇద్దరి దేశాధినేతల మధ్య సంభాషణ జరిగింది. ఈ క్రమంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్ కు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ అద్భుతంగా పని చేస్తున్నట్లు ప్రశంసించారు ట్రంప్.

అలాగే రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు మోదీ మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. ట్రంప్ ఫోన్ కాల్ పై స్పందించిన మోదీ భారత్-అమెరికా మధ్య సమగ్ర మరియు ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కాగా ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో తానే భారత్-పాక్ మధ్య ఒప్పందాన్ని కుదిర్చినట్లు ట్రంప్ చాటింపు వేసుకున్నాడు.

దీనిని భారత ప్రభుత్వం పలు సందర్భాల్లో ఖండించింది. అలాగే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ పై ట్రంప్ 50% సుంకాలు విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్-అమెరికా సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి.

You may also like
కోఠిలో కాల్పులు..ఇదీ జరిగింది!
చర్యలు తీసుకోండి..పవన్ కు బిడ్డను కోల్పోయిన మహిళ వినతి
ఈ సైకిల్ పై బాబు రయ్ రయ్!
ఎన్నికల బరిలో గల్వాన్ వీరుడు సంతోష్ బాబు తల్లి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions