Nara Lokesh About Banakacherla | ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ బనకచర్ల ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతీ ఏడాది గోదావరి నీళ్లు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని, గోదావరి జలాలు తెలంగాణ సరిహద్దు దాటి ఆంధ్రాలోకి వచ్చిన తర్వాతే బనకచర్ల ద్వారా వాటిని లిఫ్ట్ చేస్తామని పేర్కొన్నారు.
మిగులు జలాలు ఉన్నప్పుడే వాటిని వాడుకుంటాం అని, ఒకవేళ ఏదొక సంవత్సరం నీళ్లు రాకపోతే ప్రాజెక్టు ఖాళీగా ఉంటుందని చెప్పారు. అంతేకాని తాను కాళేశ్వరం ప్రాజెక్టుకు కన్నం పెట్టి నీళ్లు తరలించం కదా అని లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం విడిపోయినా తెలుగు ప్రజలు కలిసికట్టుగా ఉండాలన్నారు.
కానీ కొందరు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. తాము ఇలానే అనుకుంటే..గతంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డుపడే వాళ్ళం కానీ అలా చేయలేదని, టీడీపీ ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు కచ్చితంగా వస్తాయని మంత్రి లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.









