Urvashi Rautela apologises to Saif Ali Khan | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ( Saif Ali Khan )కత్తి దాడి ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సైఫ్ త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.
అయితే సైఫ్ పై జరిగిన దాడి గురించి మాట్లాడుతూ నటి ఊర్వశీ రౌతేలా ( Urvashi Rautela ) వజ్రపు ఉంగరాన్ని చూపించడం తీవ్ర విమర్శలకు కారణం అయ్యింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఊర్వశీని సైఫ్ పై జరిగిన దాడి గురించి ప్రశ్నించారు.
ఈ క్రమంలో ‘సైఫ్ పై జరిగిన దాడి దురదృష్టకరం. కానీ నేను నటించిన డాకు మహారాజ్ ( Daku Maharaj ) మూవీ రూ.150 కోట్లను కలెక్ట్ చేసింది. నాకు మా అమ్మ డైమండ్ ఉంగరాన్ని గిఫ్టుగా ఇచ్చింది. మా నాన్న రోలెక్స్ వాచ్ ని ఇచ్చారు’ అంటూ ఊర్వశీ వ్యాఖ్యానించడం పట్ల నెటిజన్లు ఫైర్ అయ్యారు.
ఈ నేపథ్యంలో నటి ఊర్వశీ తాజగా సైఫ్ అలీఖాన్ కు క్షమాపణలు చెప్పారు. ఇంటర్వ్యూ జరిగే సమయానికి తనకు సైఫ్ పై జరిగిన దాడి తీవ్రత తెలీదన్నారు. అలా మాట్లాడినందుకు తాను సిగ్గు పడుతున్నట్లు సైఫ్ అలీఖాన్ కు ఊర్వశీ క్షమాపణలు కోరారు.