ICC Fines Virat Kohli | మెల్బోర్న్ ( Melbourne ) వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు ( Boxing Day Test )లో టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ( Virat Kohli ) ఆస్ట్రేలియా యువ ఓపెనర్ 19 ఏళ్ల కానస్టాస్ ( Sam Konstas )మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే.
ఇన్నింగ్స్ 11వ ఓవర్ ను బుమ్రా ( Jasprit Bumrah ) వేస్తున్నాడు. ఇదే సమయంలో కానస్టాస్ మరియు విరాట్ కోహ్లీ ఎదురెదురుగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇదే సమయంలో ఇద్దరి భుజాలు తాకాయి.
అయితే కోహ్లీ తన దిశను మార్చుకుని కానస్టాస్ ను ఢీ కొట్టినట్లు వీడియోలు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే అంశంపై రవిశాస్త్రి కూడా స్పందించారు. ఇది అనవసరపు చర్య అన్నారు.
ఈ నేపథ్యంలో ఘటనలో విరాట్ కోహ్లీదే తప్పు అని ఐసీసీ ( ICC ) మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తేల్చారు. ఈ క్రమంలో కోహ్లీకి మ్యాచు ఫీజులో 20 శాతం ఫైన్ విధించారు. అలాగే ఒక డిమెరిట్ పాయింట్ కూడా విధించారు.