Sunday 22nd December 2024
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > జనసేన గెలుపు..100 ఏళ్ల స్వాతంత్ర్య్ర ఉద్యమ నేత సంబరాలు

జనసేన గెలుపు..100 ఏళ్ల స్వాతంత్ర్య్ర ఉద్యమ నేత సంబరాలు

Janasena Party News | సాగునీటి సంఘం ఎన్నికల్లో జనసేన నేత గెలిచారు. దింతో ఓ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి సంబరాలు చేసుకున్నట్లు జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

పిఠాపురం నియోజకవర్గం చిన్న జగ్గంపేట గ్రామ సాగునీటి సంఘం ఎన్నికల్లో ఏకగ్రవంగా ఎన్నికయిన ఎన్డీఏ కూటమి అభ్యర్ధుల గెలుపు సంబరాల్లో ఆ గ్రామ మొదటి సర్పంచ్, శతాధిక వృద్ధులు సారిపల్లి సుబ్బారావు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

స్వాతంత్ర్య్ర ఉద్యమలో పాల్గొన్న చరిత్ర ఉన్న సుబ్బారావు 25 సంవత్సరాల పాటు చిన్న జగ్గంపేట గ్రామ సర్పంచ్ గా సేవలు అందించారు. పవన్ కళ్యాణ్ భావజాలానికి ఆకర్షితులై జనసేన జెండా పట్టి యువతకు స్ఫూర్తిగా నిలిచారని జనసేన పార్టీ పేర్కొంది.

చిన్నజగ్గంపేట సాగునీటి సంఘం అధ్యక్షునిగా ఎన్నికయిన సారిపల్లి వెంకటరమణ సుబ్బారావు తనయుడు కావడం గమనార్హం. 100 ఏళ్ల వయసులోనూ నవయువకుడిలా విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న సుబ్బారావుని శాసన మండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు.

ఈ సందర్భంగా చిన్న జగ్గంపేట సాగునీటి సంఘం అధ్యక్షులుగా ఎన్నికయిన జనసేన నాయకులు సారిపల్లి వెంకటరమణతో పాటు ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయిన టీడీపీ నాయకులు శ్రీమతి చందక సత్యవతి తదితరులకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు.

You may also like
అల్లు అర్జున్ ఇంటి వద్ద హైటెన్షన్..విద్యార్థి సంఘాల ఆందోళన
మహిళ చనిపోయిందని చెప్పినా..అల్లు అర్జున్ పై ఏసీపీ సంచలనం
వారిపై చర్యలు తీసుకుంటాం..అల్లు అర్జున్ వార్నింగ్
‘అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions