Bandi Sanjay News | కాంగ్రెస్ హయాంలో తెలంగాణ సంస్కృతి పై దాడి జరుగుతుందని ఆరోపించారు కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నాయకులు బండి సంజయ్.
తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయమైంది, బతుకమ్మ మన పండుగే కాదని ప్రచారం మొదలైంది, తెలంగాణ వేడుకలో జానపదం కనుమరుగైతుంది, బాసరలో లడ్డూలు అందకుండా పోతున్నయి, కొమురవెల్లి ప్రసాదంలో నాణ్యత లేకుండా పోతున్నది, వేములవాడలో మొక్కులు చెల్లించే కోడెలు మాయమైతున్నయి, పండుగల మీద ఆంక్షలు పెరుగుతున్నయి, ఎక్కడపడితే అక్కడ ఆలయాలపై దాడులు జరుగుతున్నయని పలు అంశాలను బండి సంజయ్ ప్రస్తావించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చూసీ చూడనట్టు వదిలేస్తోందా ? లేక, ప్రభుత్వమే ఈ సాంస్కృతిక దాడిని చేయిస్తోందా ? అని అనుమానం వ్యక్తం చేశారు.