Friday 22nd August 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > పెళ్ళికొడుకు వచ్చేంతవరకు ఆగిన రైలు

పెళ్ళికొడుకు వచ్చేంతవరకు ఆగిన రైలు

Railways Helped A Groom To Reach Wedding Venue | రైల్వే అధికారులు సకాలంలో స్పందించడంతో పెళ్ళికొడుకు ఊపిరిపీల్చుకున్నాడు.

పెళ్ళికొడుకు చంద్రశేఖర్ ( Chandrashekar Wagh ) తన వివాహ కార్యక్రమం కోసం ముంబై ( Mumbai ) నుండి అస్సాం రాజధాని గౌహతి ( Guwahati ) వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం పెళ్ళికొడుకు మరియు మరో 30కి పైగా మంది బంధువులు ముంబై-హౌరా ( Howrah ) గీతాంజలి ఎక్స్ప్రెస్ ( Geetanjali Express) లో బయలుదేరారు.

కోల్కత్త హౌరాలో పెళ్లి బృందం హౌరా గౌహతి సరాయ్ ఘాట్ ఎక్స్ప్రెస్ ( Saraighat Express ) ట్రైన్ ను చేరుకోవాలి. అయితే ముంబై నుండి బయలుదేరిన గీతాంజలి ఎక్స్ప్రెస్ ఆలస్యం అయ్యింది. దింతో కనెక్టింగ్ ట్రైన్ ( Connecting Train ) ను అందుకోలేము అని ఆందోళనకు గురైన పెళ్ళికొడుకు చంద్రశేఖర్ రైల్వే అధికారులను ఎక్స్ ద్వారా రిక్వెస్ట్ చేసాడు.

దింతో ఉన్నతాధికారులు హౌరా డీఆర్ఎం కు అర్జంట్ మెసేజ్ ( Urgent Message ) పంపించారు. ఈ క్రమంలో హౌరా నుండి గౌహతికు 4 గంటలకు వెళ్లాల్సిన ట్రైన్ ను అధికారులు కొద్దిసేపు ఆపేశారు. 4 గంటల 8 నిమిషాలకు గీతాంజలి ఎక్స్ప్రెస్ హౌరా చేరుకుంది.

వెంటనే బ్యాటరీ వెహికల్స్ ద్వారా పెళ్లి బృందాన్ని సిబ్బంది గౌహతి వెళ్లాల్సిన ట్రైన్ ప్లాట్ఫార్ కు తరలించారు. దింతో పెళ్ళి బృందం ఊపిరిపీల్చుకుంది. అనంతరం వరుడు అధికారులు ధన్యవాదాలు తెలిపారు.

You may also like
solar panels
భారతీయ రైల్వే మరో వినూత్న ప్రయోగం!
ktr comments
భయం కాదు.. రక్షణ కావాలి: కేటీఆర్ ట్వీట్!
వీధి కుక్కలకు QR Code
‘వారికోసం ఆలోచించండి’.. పుతిన్ కు ట్రంప్ సతీమణి లేఖ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions